'పొలిమేర2' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ 'టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ చాలా బావుందంటున్నారు. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో ప్రియదర్శి ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

సత్యం రాజేష్ ప్రేమకథ, పెళ్లి సన్నివేశాలతో ఫీల్ గుడ్ గా మొదలైన ట్రైలర్ తర్వాత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం కట్టిపడేసింది. ట్రైలర్ లో చూపించిన కంటెంట్ చాలా ఎక్సయిటింగ్ గా వుంది. పోలీస్ అధికారి ఎస్తర్ ''నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వే చంపేయడం ఏమిటి? అని ప్రశించగా.. ‘రావణాసురుడు  సీతని చెరబడితే శిక్ష సీతకెందుపడింది?’ అని సత్యం రాజేష్ ఎదురు ప్రశ్నించడం కథ పై మరింత క్యురియాసిటీని పెంచింది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు సత్యం రాజేష్. ట్రైలర్ లో కనిపించిన మిగతా నటులు కూడా తమ పాత్రలలో ఒదిగిపోయారు. దర్శకుడు  వై. యుగంధర్ ఎంచుకున్న పాయిటింగ్ చాలా ఎమోషనల్, థ్రిల్లింగ్ గా వుంది. నేపధ్య సంగీతం థ్రిల్ మని మరింత ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.

రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా హీరో ప్రియదర్శి హాజరయ్యారు. ఎక్కువ మంది ప్రేక్షకులకు టెనెంట్ సినిమా రీచ్ అవుతుందని నమ్ముతున్నానన్న ప్రియదర్శి కంటెంట్ చాలా కొత్తగా వుందన్నారు. ఏప్రిల్ 19న సినిమా వస్తోందని.. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడాలని ప్రియదర్శి కోరారు.  


టెనెంట్' సినిమా అద్భుతంగా వచ్చిందన్న హీరో సత్యం రాజేశ్.. డబ్బింగ్ చెబుతున్నప్పుడు కన్నీళ్లొచ్చాయన్నారు. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మంచి చదువరి అన్న రాజేశ్‌ ఆయన ఆలోచనలో ఉన్నతంగా నెక్స్ట్ జనరేషన్ గా వుంటాయన్నారు. ఈ సినిమాని చాలా ప్రేమించి చేశారన్న రాజేశ్‌.. తప్పకుండా ఇది ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు. చందన అద్భుతంగా నటించారు. ఎస్తెర్ గారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. భరత్ చందు అనురాగ్ పోటాపోటీగా నటించారు. సాగర్ గారు చాలా చక్కని సంగీతం అందించారు. ఏప్రిల్ 19న సినిమా విడుదలౌతుందన్నారు.


ప్రతి ఇంట్లో మహిళలకు కనెక్ట్ అయ్యే కథ ఇదని దర్శకుడు వై.యుగంధర్ అన్నారు. మహిళలు చూస్తే తప్పకుండా చూడాలని అబ్బాయిలకి చెబుతారని... ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా నిర్మాత అని దర్శకుడు వై.యుగంధర్ అన్నారు. సాగర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారని... సత్యం రాజేష్ గారు చాలా గొప్పగా సపోర్ట్ చేశారని చెప్పారు.  ఎస్తర్ గారు చాలా చక్కని సమన్వయంతో ఎంతగానో ప్రోత్సహిస్తూ ఈ సినిమాని చేశారు. భరత్,చందన పాత్రలు కూడా గుర్తుండిపోతాయి. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  ఏప్రిల్ 19న సినిమా వస్తోంది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా. ఎమోషన్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని దర్శకుడు వై.యుగంధర్ అన్నారు.


'టెనెంట్'.. బలగం, కాంతార లాంటి సహజత్వంతో కూడుకున్న సినిమా అని.. ఇందులో ఎమోషన్ అద్భుతంగా వుంటాయని... రాజేష్ గారు, ఎస్తర్ గారు నటీనటులంతా చాలా అద్భుతంగా నటించారని నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి  అన్నారు. యుగంధర్ నిర్మాతల దర్శకుడన్న నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి .. సినిమా  చాలా అద్భుతంగా వచ్చిందని  మీ అందరికీ నచ్చుతుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: