తమిళ , తెలుగు పరిశ్రమలలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సిద్ధార్థ్ ఒకరు. తన కెరీర్ ను తమిళ సినిమాల ద్వారా మొదలు పెట్టాడు. ఆ మూవీ ల ద్వారా తెలుగు లో ఈయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు తగ్గడం ... అలాగే ఈయన నటించిన సినిమాలు కూడా మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ నటుడికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది.

ఇకపోతే తాజాగా సిద్ధార్థ్ "చిత్తా" అనే సినిమాలో హీరో గా నటించాడు. తమిళ్ లో రూపొందిన ఈ మూవీ మొదటగా తమిళ్ లో విడుదల అయ్యి అక్కడ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమాని తెలుగు లో చిన్నా అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ చాలా కాలం తర్వాత సిద్ధార్థ్ కి మంచి విజయం అందించింది. ఇకపోతే తాజాగా చిత్తా మూవీ లోని సిద్ధార్థ్ నటనకు గాను అతనికి మేన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు లభించింది.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు. ఈ మూవీ ని చూసి ఇబ్బందిగా ఫీల్ అయ్యాం అంటూ కొందరు చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల అద్భుతమైన విజయం సాధించిన బాలీవుడ్ సినిమా యానిమల్ ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఎంజాయ్ చేస్తూ చూశారు. మంచి కథతో సినిమా చేస్తే కొందరు డిస్టర్బ్ అయ్యారు. ఇది నిజంగా సిగ్గు చేటు అని సిద్ధార్థ్ పేర్కొన్నారు. ఇకపోతే ప్రస్తుతం కూడా సిద్ధార్థ్ వరస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: