ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది మీనాక్షి చౌదరి. ఈ సినిమా కంటే ముందు కూడా పలు సినిమాలు చేసి హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే సినిమాలో నటిస్తోంది. దానితోపాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ నటిస్తున్న మట్కా సినిమాలో సైతం నటిస్తోంది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమానే కాకుండా తొలిప్రేమ దర్శకుడు

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న లక్కీ భాస్కర్ సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది మీనాక్షి. అలా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన మరొక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే టాలీవుడ్ నుండి ఈ ముద్దుగుమ్మ మరొక బంపర్ ఆఫర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. అది కూడా స్టార్ హీరో సినిమాలో నటించబోతుందట. ఆ స్టార్ హీరో మరెవరో కాదో విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో

ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో వెంకీకి జోడీగా మీనాక్షినూయి తీసుకోనున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ లక్ అంటే మీనాక్షిదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో ఇప్పటికే F2, f3 చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఎంతపెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: