టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే తమన్నా హీరోయిన్ గా చేస్తూనే పలు ఐటమ్ సాంగ్స్ చేసి అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా తమన్నాతోపాటు బొద్దుగుమ్మ రాశీ ఖన్నా కూడా కలిసి ఓ హారర్ మూవీలో స్పెషల్ సాంగ్ లో నటించారు.ఆ హార్రర్ కామెడీ మూవీనే “బాక్”.త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.తమిళ చిత్ర పరిశ్రమలో భారీగా విజయాన్ని అందుకున్న హారర్ కామెడీ సిరీస్ అరణ్‌మనై. ఈ సిరీస్ నుంచి నాల్గవ చిత్రంగా అరణ్‌మనై 4 వస్తోంది. ఈ సినిమాను తెలుగులో బాక్ పేరుతో మేకర్స్ విడుదల చేస్తున్నారు. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా మరియు రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఇటీవల మేకర్స్ ఈ సినిమాలోని అన్ని ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఏప్రిల్ 14న బాక్ సినిమా నుంచి 'పంచుకో'అనే పూర్తి సాంగ్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

కోలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ పాప్ తమిళ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.ఈ సాంగ్ లో తమన్నా, రాశీఖన్నాలు తమ గ్లామర్‌ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి, హీరోయిన్స్ ఇద్దరూ హాట్ అందాలతో అదరగొట్టారు. అలాగే సాంగ్‌లో సినిమాలోని కొన్ని ఎగ్జయిటింగ్, హారర్ సన్నివేశాలను కూడా చూపించడం జరిగింది.ఈ పాట చూస్తే ఒక ఐటమ్ లేదా స్పెషల్ నెంబర్‌లా ఉంది.పంచుకో అంటూ తమన్నా, రాశీ ఖన్నా వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. కాగా ఈ సినిమాను అవ్నీ సినిమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఖుష్బు సుందర్ మరియు ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్ మరియు కోవై సరళ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.ఏప్రిల్ 26న 'బాక్ ' సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: