ఇప్పటికే ఎన్నో టాలీవుడ్, కోలీవుడ్ మూవీలలో నటించి రెండు ఇండస్ట్రీ లలో కూడా అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణులు అయినటువంటి తమన్నా , రాశి కన్నా ప్రస్తుతం "అరుణ్మనై 4" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు తమిళ సినీ పరిశ్రమలో హర్రర్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అయినటువంటి దర్శకులలో ఒకరు అయినటువంటి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇప్పటికే ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన 3 మూవీ లు వచ్చాయి. అవి కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ఈ సిరీస్ లోని మూవీ లు తెలుగు లో వేరు వేరు పేర్లతో విడుదల అయ్యాయి. ఇది ఇలా ఉంటే "అరుణ్మనై 4" సినిమా కూడా తెలుగు లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు లో "బాక్" అనే పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని కూడా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీలో తమన్నా , రాశి ఖన్నా క్యారెక్టర్ పోస్టర్ లను కూడా ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే విడుదల చేసింది. ఈ మూవీ లో తమన్నా ... శివాని పాత్రలో కనిపించనుండగా రాశి కన్నా ... మాయ పాత్రలో కనిపించబోతుంది.

ఇకపోతే తాజాగా "అరుణ్మనై 4" తెలుగు వర్షన్ బ్లాక్ మూవీ విడుదల తేదీని తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ సినిమాని ఏప్రిల్ 26 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటిస్తూ అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: