కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ తాజాగా గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి తాజాగా "విజిల్ పోడు" అంటూ సాగే పాటను విడుదల చేసింది. ఇకపోతే ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటలు పూర్తి అయ్యే సరికి 24.8 మిలియన్ వ్యూస్ ను ... 125.4 లాక్స్ ను సాధించింది.  ఈ సాంగ్ 24.88 మిలియన్ వ్యూస్ తో ఆల్ టైం సౌత్ ఇండియా రికార్డ్ ను క్రియేట్ చేయగా ... 1.254 మిలియన్ లైక్స్ తో సౌత్ ఇండియాలో 5 వ స్థానంలో నిలిచింది. ఇలా ఈ మూవీ మొదటి పాట ఓవరాల్ గా రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

మూవీ లో విజయ్ 2 పాత్రలలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక ఈ మూవీ నుండి చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన సాంగ్ కూడా అదిరిపోయే రేంజ్ లో వైరల్ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రం ఈ మూవీ పై పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే సెప్టెంబర్ 5 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: