తెలుగు, తమిళ పరిశ్రమలలో టాప్ హీరోయిన్ గా చాలా సంవత్సరాలు కెరీర్ ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. హ్యాపీ డేస్ మూవీ ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును ఈ బ్యూటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కడం ... అలాగే ఈమె నటించిన చాలా శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో చాలా తక్కువ కాలంలో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ స్థాయికి వెళ్లిపోయింది.

అలాంటి సమయంలోనే ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా వరుస అవకాశాలు దక్కాయి. అక్కడ కూడా మంచి విజయాలను అందుకొని చాలా తక్కువ సమయంలో కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఇలా తెలుగు , తమిళ సినీ పరిశ్రమలలో చాలా కాలం క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించిన ఈ బ్యూటీ ఇప్పటికీ కూడా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ ను ఫుల్ బిజీగా ముందుకు సాగిస్తుంది.

కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా యంగ్ ఏజ్ లో కూడా ఆరబోయని స్థాయిలో కొన్ని సినిమాల్లో ఈ బ్యూటీ ఈ వయసులో తన అందాలను ఆరబోస్తూ కొర్రకారుకు మంచి కిక్ నీ ఎక్కిస్తోంది. తాజాగా ఈమె "అరుణ్మనై 4" అనే తమిళ సినిమాలో కీలక పాత్రలు నటించింది. ఈ మూవీ తెలుగులో "బాక్" అనే పేరుతో విడుదల కానుంది. ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితం ఓ పాటను విడుదల చేయగా అందులో తమన్నా తన అందాలతో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించింది. ఇలా తమన్నా ఈ వయసులో వరస సినిమాల ఆఫర్ లను అందుకోవడం మాత్రమే కాకుండా తన అందాలతో కూడా యూత్ కి మంచి కిక్ నీ ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: