పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ నటించిన సలార్ సినిమా డిసెంబర్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే అప్పటివరకు ఫ్లాప్స్ తో సతమతమవుతున్న ప్రభాస్ కి సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. దాంతో ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా చేస్తున్నాడు .అయితే ఈ సినిమాను మహానటి ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో రాబోతోంది. అంతేకాదు ఈ సినిమాలో అమితాబచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ సైతం కనిపించబోతున్నారు. 

దాంతోపాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే దిశా పటాన్ని హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తో పాటు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్   ప్రభాస్ మరొక సినిమా కూడా చేస్తున్నాడు. అదే మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్. హారర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో మలయాళ భామ మాళవిక మోహన్ తో పాటు ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం హీరోయిన్ గా కనిపించబోతున్నారు .అయితే ఈ సినిమాలో ఈ ఇద్దరు బ్యూటీ లతో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 

యితే సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రభాస్ కి తాత పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిధి అగర్వాల్‌ హైదరాబాద్‌లో జరుగుతున్న రాజాసాబ్‌ షూట్‌లో జాయిన్ అయిందని సమాచారం. కొన్ని రోజులుగా జరుగుతున్న షూటింగ్‌లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్  ప్రభాస్‌, నిధి అగర్వాల్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. తాజా షెడ్యూల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే మేకర్స్‌ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మారుతి టీం తెలుగు మరియు తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: