కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ సజ్జ ఆ పాత్రలతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు . అలా ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు . అందులో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కానుక గా ఈయన నటించిన హనుమాన్ సినిమా విడుదల అయ్యింది. 

భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది . ఈ మూవీ తో తేజ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. దానితో తేజ తన తర్వాత మూవీని ఏ దర్శకుడు తో సినిమా చేస్తాడు అనే దానిపై జనాల్లో ఆసక్తి బాగా పెరిగి పోయింది. ఇక పోతే తేజ తన తదుపరి మూవీ ని ఈగల్ సినిమా దర్శకుడు అయినటు వంటి కార్తీక్ ఘట్టమనేని తో చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది . ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు . తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఏప్రిల్ 18 వ తేదీన ఉదయం 10 గంటలకు రామా నాయుడు స్టూడియోస్ , ఫిలిం నగర్ లో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ మరియు గ్లిమ్స్ వీడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: