రెబల్ స్టార్ ప్రభాస్ చాలా రోజుల క్రితమే మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నీది అగర్వాల్ , మాళవిక మోహన్ ,  రీద్దీ కుమార్ లు ప్రభాస్ కి జోడి గా నటించబోతూ ఉండగా ... బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రభాస్ కి తాత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ సస్పెన్స్ హారర్ కామెడీ జోనర్ లో రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే చాలా కాలం అవుతుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన చాలా బాగా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన చాలా బాగం షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈ మూవీ నుండి ఒక ప్రభాస్ కి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను మినహాయిస్తే ఈ మూవీ యూనిట్ పెద్దగా ఈ సినిమా నుండి ఎలాంటి కంటెంట్ ను విడుదల చేయలేదు. అయినప్పటికీ ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం రాజా సాబ్ మూవీ యూనిట్ ప్రభాస్ మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ పై ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు ఈ సాంగ్ లో ప్రభాస్ అలాగే నిధి అగర్వాల్ ఇద్దరూ కూడా అదిరిపోయే రేంజ్ డాన్స్ తో రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే నిధి అగర్వాల్ , మాలవికా మోహన్ , రీద్దీ కుమార్ లకి తెలుగు లో మంచి క్రేజ్ లభించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: