కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటనలో విశాల్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈయన ఇప్పటివరకు తన కెరీర్ లో నటించిన చాలా సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో భాగంగా తెలుగు లో కూడా ఈయన నటించిన కొన్ని సినిమాలు విజయాలను సాధించడంతో ప్రస్తుతం విశాల్ కి తెలుగు పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు హరి దర్శకత్వంలో రూపొందిన రత్నం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 26 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి (యు / ఎ) సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే విశాల్ , హరి కాంబోలో రూపొందిన పూజ మూవీ మంచి విజయం సాధించింది. మరి రత్నం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: