బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా దర్శకుడు అయినటువంటి సాగర కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న టైసన్ నాయుడు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఒక వైపు టైసన్ నాయుడు సినిమాలో హీరోగా నటిస్తూనే తాజాగా ఈ యువ నటుడు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇకపోతే ఈ మూవీ బృందం "బి ఎస్ ఎస్ 11" అనే ఎం వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని అనౌన్స్ చేసింది.

మరి ఈ మూవీ కి సంబంధించిన కొన్ని క్రేజీ వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరియర్ లో 11 వ సినిమాగా రూపొందబోతున్న ఈ చిత్రానికి కౌశిక్ పేగళ్లపాటి రచన మరియు దర్శకత్వం వహించబోతున్నాడు. బి అజనేష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా పని చేయనుండగా ... చిన్మయి సలాస్కార్ ఈ మూవీకి సినిమాటో గ్రాఫర్ గా పని చేయబోతోంది. నిరంజన్ దేవరమానే ఈ సినిమాకు ఎడిటర్ గా వర్క్ చేయనుండగా ... షైన్ స్క్రీన్స్ సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ హార్రర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందబోతుంది. 

ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆఖరుగా తెలుగులో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి చత్రపతి మూవీ ని హిందీ లో రీమేక్ చేశాడు. ఈ మూవీ చత్రపతి అనే టైటిల్ తోనే హిందీ లో విడుదల అయినప్పటికీ ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. దానితో ఈ నటుడువకి ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్దగా గుర్తింపు ఏమీ దక్కలేదు. ఇక ప్రస్తుతం మాత్రం ఈయన వరుస పెట్టి తెలుగు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bss