తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటలలో ఒకరు అయినటువంటి సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ చాలా సంవత్సరాల క్రితమే తెలుగు తరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈయన ప్రేమ కావాలి అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత లవ్లీ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మరో విజయాన్ని అందుకున్నాడు. 

ఇలా కెరియర్ ప్రారంభంలో రెండు విజయాలను అందుకున్న ఈయన ఆ తర్వాత మాత్రం వరుస అపజాయలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఇక గత రెండు సంవత్సరాల కాలం లోనే ఈయన దాదాపు అరడజన్ పైగా సినిమాల్లో నటించినప్పటికీ ఏ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం విజయాన్ని కూడా అందుకోలేదు. అలాంటి సమయం లో ఈయన కొంత కాలం గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ఓ మూవీ ని స్టార్ట్ చేశాడు. తాజాగా ఈ నటుడి కొత్త మూవీ కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల అయ్యింది. ఆది సాయి కుమార్ ప్రస్తుతం "కృష్ణ ఫ్రమ్ బృందావనం" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసింది.

ఇకపోతే ఈ సినిమాలో దిగంగణ సూర్య వంశీ హీరోయిన్ గా కనిపించనుండగా ... వీరభద్రం చౌదరి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. అనుప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా పని చేయనుండగా ... శ్యామ్ దుప్పటి ఈ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. చోటా కె ప్రసాద్మూవీ కి ఎడిటర్ గా పని చేయనుండగా ... లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: