తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి కార్తికేయ ప్రస్తుతం "భజే భాయు వేగం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ కార్తికేయ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. దానికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఐశ్వర్య మీనన్ ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించనుంది.

యు వి కాన్సెప్ట్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ విడుదల తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీని సమయాన్ని ప్రకటించారు. ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమా యొక్క టీజర్ ను ఈ రోజు అనగా ఏప్రిల్ 20 వ తేదీన మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో కార్తికేయ ఔట్ అండ్ అవుట్ బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని చేతిలో ఓ బాటు పట్టుకొని చాలా మంది ని కొట్టి పరిగెడుతున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. మరి "బెదురులంక 2012" సినిమా విజయంతో సూపర్ ఫామ్ లో ఉన్న కార్తికేయ "భజే వాయు వేగం" సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: