తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో సూర్య ఒకరు. ఈయన ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తమిళ ఇండస్ట్రీ లో ఫుల్ జోష్ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే సూర్య కేవలం తమిళ సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి స్థాయిని ఏర్పరచుకున్నాడు. ఇప్పటివరకు తాను నటించిన ఎన్నో సినిమాలను ఈ నటుడు తెలుగు లో విడుదల చేశాడు.

అందులో చాలా మూవీలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో ఈయనకు టాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ లభించింది. ఇలా తెలుగులో ఈయనకు మంచి గుర్తింపు ఉండడంతో మరికొన్ని రోజుల్లోనే ఇతను బోయపాటి శ్రీను దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందబోయే సినిమాలో నటించబోతున్నట్లు ఓ వార్త కూడా వైరల్ అయ్యింది. ఇదంతా కాసేపు పక్కన పడితే ప్రస్తుతం సూర్య , శివ దర్శకత్వంలో రూపొందుతున్న కాంగువ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం విడుదల చేయనున్నట్లు ఈ  చిత్ర బృందం ప్రకటించింది. ఇకపోతే సూర్యమూవీ తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా కార్తీక్ సుబ్బరాజు తండ్రిమూవీ కి సంబంధించిన ఒక అప్డేట్ ప్రకటించారు. రీసెంట్ గా కార్తీక్ సుబ్బరాజ్  తండ్రి మాట్లాడుతూ ఈ సినిమా ఎప్పుడు నుంచి మొదలు కానుంది అనేది రివీల్ చేశారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ నెల నుంచి స్టార్ట్ కానున్నట్టుగా వారు కన్ఫర్మ్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువా కనుక భారీ హీట్ అయినట్లు అయితే కార్తీక్ సుబ్బరాజు మూవీ పై కూడా అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: