అలనాటి అందాల నటి మరియు అందాల భామ సినీ ఇండస్ట్రీలో గడుసరి అమ్మాయిగా పేరున జమున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు మరియు తమిళ్ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఈమె 200 కి పైగా సినిమాల్లో నటించారు. ఇక అనారోగ్యంతో బాధిస్తూ గత సంవత్సరం ఈమె చివరి శ్వాస విడిచింది. ఇక జమున కి ఒక కుమారుడు మరియు కూతురు కూడా ఉన్నారు. ఇక జమున సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అలనాటి అగ్ర హీరోలలో ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ వారితో వివాదాల కారణంగా మూడేళ్ల పాటు వారితో నటించకపోయినా.. నిలదొక్కుకున్నారంటే జమున ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చు.

ఈమె 1936 ఆగస్టు 30న జన్మించారు. ఇక 1965లో శ్రీ వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీ లో జువాలజీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న జాలూరి వెంకటేశ్వరరావు ని వివాహమాడింది జమున. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. పేర్లు వంశీకృష్ణ, స్రవంతి. ఇక ఈమె 1964లో మూగమనసులు సినిమాకు ఉత్తమ నటిగా ఫిలిం ఫైర్ అవార్డు అందుకుంది. ఇక రెండువేల ఎనిమిదిలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. 2021లో సాక్షి మీడియా లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందుకున్నారు. ఇక ఈమె సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి ఘోరంగా ఓడిపోయారు.

ఇక అలా జరిగిన అనంతరం రాజకీయాల నుంచి బయటికి వచ్చేసింది జమున. ఇక ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్లతో వివాదాల విషయానికి వస్తే.. 1953 నుంచి 1962 వరకు 25 కు పైగా సినిమాల్లో నటించారు. చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అందులో ఎన్టీఆర్ గారు మరియు నాగేశ్వరరావు గార్లతో కూడా చేశారు. ఇక అప్పటికే జమున గారిపై మూవీ ఇండస్ట్రీలో ఓ అభిప్రాయం ఉండేది. జమున చాలా ఆటిట్యూడ్ చూపిస్తారని.. ఎలాంటి సీరియల్ నటుడు ఎదురుగా ఉన్నా సరే కాలుపై కాలు వేసుకుని కూర్చుంటారని.. మాట కూడా చాలా అహంకారంగా చెబుతారని.. పేరు ఉండేది. ఇక అప్పట్లో ఏఎన్ఆర్ కూడా బహిరంగంగా ఓ ప్రకటన చేశారు. జమున గారితో సినిమాలు చేసేదే లేదని అఫీషియల్ గానే ప్రకటించారు.

అయితే విజయవాహిని నిర్మాతలు అయినవి ఆదిరెడ్డి చక్రపాణి గారు ఒక జానపద గేయాన్ని నిర్మిస్తే ఆ తరువాత మూవీ తీసేవారు. ఆ సమయంలోనే విఠలాచార్య కన్నడ సినిమా రైట్స్ కూడా వారి వాగ్దే ఉన్నాయి. దీంతో ఓ కథ ప్రిపేర్ చేసుకున్నారు. అదే గుండమ్మ కథ. ఆ సినిమాలో సావిత్రితో పాటు జమున కూడా కథానాయకులుగా ఎన్టీఆర్ గారు మరియు ఏఎన్ఆర్ గారు హీరోలుగా.. నటించారు. ఇక అప్పటికే జమున ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ తో నటించి మూడేళ్లు అయింది. ఎవరికివారు భీష్మించుకుని వేరే వారితో సినిమాలు చేస్తున్నారు. ఇక జమున గారు కృష్ణ గారు జగ్గయ్యతో హిట్ సినిమాలు చేశారు. ఎలా అయినా సరే గుండమ్మ కథ సినిమాలో జమున గారితో చేయించాలని అనుకున్న నాగిరెడ్డి ..ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ తో మాట్లాడితే ఎవరు ఒప్పుకోలేదు. ఇక వీరు కొంత షూటింగ్ చేసినప్పటికీ ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు. అలా ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ తో గొడవలను పెట్టుకుంది జమున

మరింత సమాచారం తెలుసుకోండి: