ఈ మధ్య కాలంలో వరుసగా వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ వస్తున్న అల్లరి నరేష్ తాజాగా "ఆ ఒక్కటి అడక్కు" అనే పక్క కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించాడు. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. మళ్లీ అంకం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

మూవీ ని సమ్మర్ కానుకగా మే 3 గా తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రచారాలను కూడా జోరుగా ముందుకు సాగిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇక పోతే ఈ మూవీ బృందం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతుంది.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు అనగా ఏప్రిల్ 22 వ తేదీన ఏ ఏ ఏ సినిమాస్ , అమీర్ పేట్ సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో అల్లరి నరేష్ , ఫరియా అబ్దుల్లా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాతో అల్లరి నరేష్ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

An