‘ప్రేమమ్’ మూవీతో యూత్ కు క్రేజీ హీరోయిన్ గా మారిన అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ అదేవిధంగా ఎక్స్ పోజింగ్ పాత్రలకు దూరంగా ఉంటుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆమె ‘టిల్లు స్క్వేర్’ లో చేసిన గ్లామర్ ఎక్స్ పోజింగ్ ఆమూవీ ఘన విజయంలో ఒక కీలక పాత్రను పోషించింది. అమెరికాలో ఈమూవీ ఈమూవీ ఏకంగా 5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని వస్తున్న వార్తాలను బట్టి ఈమూవీ కేవలం తెలుగు రాష్ట్రాలలోని యూత్ కు మాత్రమే కాకుండా ఓవర్సీస్ ప్రేక్షకులకు కూడ ఏరేంజ్ లో నచ్చిందో అర్థం అవుతుంది.ఇప్పటివరకు అనుపమ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ‘టిల్లు స్క్వేర్’ లో నటించడానికి ఆమెకు అత్యంత భారీ పారితోషికం ఇచ్చారు అన్న వార్తలు ఉన్నాయి. వాస్తవానకి అనుపమ కంటే ముందు ఈమూవీలోని హీరోయిన్ పాత్రకు శ్రీలీల ను ఎంపిక చేశారు అని అంటారు. అయితే ఆమె ఈ మితిమీరిన గ్లామర్ ఎక్స్ పోజింగ్ కు నో చెప్పడంతో ఆమె స్థానంలో అనుపమ వచ్చి చేరింది అన్న వార్తలు ఉన్నాయి.ఈమూవీ ఊహించిన స్థాయికన్నా ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు చాలామంది దర్శక నిర్మాతలు అనుపమ పరమేశ్వరన్ ను తమ సినిమాలలో హీరోయిన్ గా నటింప చేసే విషయంలో రెండు కోట్ల వరకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నట్లు గాసిపులు హడావిడి చేస్తున్నాయి. అయితే తమ సినిమా కథలో కూడ కథ రీత్యా కొన్ని ఎక్స్ పోజింగ్ సన్నివేశాలు ఉన్నాయని డానికి ఆమె నో చెప్పకూడదు అని కండిషన్స్ పెడుతున్నట్లు టాక్.అయితే ఇలాంటి కండిషన్స్ కు అనుపమ నో చెప్పడమే కాకుండ కేవలం వెరైటీ కోసమని తాను ‘టిల్లు స్క్వేర్’ లో నటించానని నటనకు ప్రాధాన్యత ఉన్న నటనకు ప్రాధాన్యత పాత్రలు మాత్రమే తాను ఎంచుకుంటానని పారితోషికం తనకు తొలి ప్రాధాన్యయత కాదు అంటూ తనకు వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: