లేటెస్ట్ గా విడుదలైన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ విజయవంతం కాకపోయినా రాబోతున్న ‘గేమ్ ఛేంజర్’ లో అంజలి కెరియర్ కు ఊహించిని ట్విస్ట్ రాబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. విడుదల తేదీ ఖరారు కాకపోయినా అక్టోబర్ లో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రావడం పక్కా అని తేలిపోవడంతో  రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈమూవీ విడుదల  గురించి  ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు.  నిన్న మొన్నటివరకు తన కూతురి పెళ్లిలో బిజీగా ఉన్న దర్శకుడు శంకర్ పెళ్లి హడావిడి పూర్తి అవడంతో ముందుగా జూన్ లో ‘ఇండియన్ 2’ రిలీజ్ పై దృష్టిపెట్టి ఆతరువాత అక్టోబర్ లో ‘గేమ్ ఛేంజర్’ విడుదల  చేస్తాడు అన్నసంకేతాలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఈమధ్యనే విడుదలైన ‘జరగండి జరగండి’ లిరికల్ వీడియోకి మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో ఈమూవీ ప్రమోషన్ చాలా డిఫరెంట్ గా చేయబోతున్నారని తెలుస్తోంది.  ముఖ్యంగా ఈమూవీ టీజర్ చాల డిఫరెంట్ గా ఉండేలా డిజైన్ చేస్తూ వచ్చేనెలలో విడుదల చేయాలని శంకర్ ఆలోచన అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ‘గేమ్ ఛేంజర్’ లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నది  కియారా అద్వానీ అయినప్పటికి తెలుగు తెర సీతమ్మ అంజలికి ఈమూవీలో  కీలకపాత్ర ఉన్నట్లు వార్తలు వస్తునాయి. ఈమూవీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పెద్దవాడైన రామ్ చరణ్ భార్యగా ఎవరూ ఊహించని తరహాలో శంకర్ ఆమె పాత్రను డిజైన్ చేశారట.కమలహాసన్ ‘భారతీయుడు’ లో సుకన్య తరహాలో యాక్టింగ్ మేకప్ రెండు  చాలక్లిష్టం అనిపించేలా అంజలిని ప్రెజెంట్ చేశారట. ఈమూవీలో ఆమె పాత్రకు ఒక పాట కూడ ఉంటుందని తెలుస్తోంది. ఈపాట ఎమోషనల్ గా దేశభక్తిని మిళితం చేస్తూ తమన్ కంపోజ్ చేశాడని వార్తలు వస్తున్నాయి.     అంచనాలకు అనుగుణంగా ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అంజలి  మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేస్తోంది. విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లోనూ పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలో అంజలి నటిస్తున్న విషయం  తెలిసిందే..  మరింత సమాచారం తెలుసుకోండి: