తెలుగమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఈమె మొదట తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అందులో భాగంగా జర్నీ అనే సినిమాతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమెకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అవకాశం దక్కింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత వరుసగా అంజలి కి తెలుగు లో అవకాశాలు పెరిగాయి. 

దానితో చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ గా కెరియర్ ను ముందుకు సాగించిన ఈమె అందులో భాగంగా గీతాంజలి అనే హార్రర్ కామెడీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇకపోతే 2014 వ సంవత్సరం విడుదల ఆ సమయంలో మంచి విజయం అందుకున్న ఈ సినిమాకు దాదాపు పది సంవత్సరాల తర్వాత గీతాంజలి మళ్లీ వచ్చింది అనే పేరుతో సీక్వెల్ లో రూపొందించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ ల రిపోర్ట్ ను అఫిషియల్ గా విడుదల చేశారు.

మూవీ యూనిట్ వారు ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో శ్రీనివాసరెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , ఆలీ , సునీల్ ముఖ్య పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: