రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఎక్కువ శాతం తన ఇంట్రెస్ట్ ను కేవలం సినిమాలపైనే పెడుతూ ఉంటాడు. ఇతర ఈవెంట్ లపై , ఫంక్షన్ లపై ఆయన పెద్దగా ఫోకస్ పెట్టడు. అలాగే ప్రభాస్ కి కాస్త మొహమాటం ఎక్కువ అనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. దానితో ఆయన పబ్లిక్ ఈవెంట్ లకి , ఫంక్షన్ లకి రావడానికి ఎక్కువగా ఇష్టపడడు.

అలాగే ఆయన సినిమాలకు ఆయన ప్రమోషన్ లు చేసుకోవడంలో కూడా కాస్త ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాకపోతే సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడం కోసం తప్పని పరిస్థితుల్లో ఆయన జనాల్లోకి వచ్చి ఆ సినిమా గురించి చెబుతూ ఉంటాడు. అంతటి మొహమాటం కలిగిన ప్రభాస్ తన సినిమాల గురించి పట్టించుకోవడం తప్ప పెద్దగా బయటి విషయాలు గురించి పట్టించుకోడు. కాకపోతే ఎవరికైనా అవసరం అనుకుంటే డబ్బులను ఇస్తాడు.

కానీ దానిని బయటికి కూడా చెప్పడు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన ప్రభాస్ తాజాగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక ఈవెంట్ కు భారీ మొత్తం విరాళాన్ని ఇచ్చాడు. కానీ ఆ విషయం ఆయన ద్వారా బయటకు రాలేదు. మరో డైరెక్టర్ ద్వారా ఆ విషయం బయటకు వచ్చింది. అసలు ఆ ఈవెంట్ ఏమిటి..? దానికి ప్రభాస్ ఎంత విరాళం ఇచ్చాడు..? దానిని ఎవరి బయటికి చెప్పారు..? అనే విషయాలను తెలుసుకుందాం. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4 వ తేదీన డైరెక్టర్స్ డే గా తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ నిర్వహిస్తోంది.

ఇందుకోసం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఇక ఈ విషయం ప్రభాస్ కి తెలియడంతో ఏకంగా ఈ ఈవెంట్ కు 35 లక్షలు అందజేశాడట. ఈ విషయం ఈయన కాకుండా ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్న మారుతి చెప్పుకొచ్చాడు. ఇలా ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరగబోయే డైరెక్టర్ల ఈవెంట్ కు భారీ మొత్తంలో విరాళాన్ని ఇచ్చాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: