టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా గీతా గోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వంలో వచ్చింది. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇక విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కథ రోటీన్ గా ఉండడం కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.

 ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ఓటిటి లొకి ఎంట్రీ ఇవ్వడానికి డేట్ లాక్ చేసింది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 26 నుండి తెలుగు తో పాటు తమిళ భాషలో కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని అధికారికంగా తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గోవర్థన్ (విజయ్ దేవరకొండ)ది మధ్యతరగతి ఉమ్మడి కుటుంబం. ఇద్దరు అన్నయ్యలు,

వాళ్ల పిల్లలు, నాన్నమ్మ.. ఇలా అందరి భాద్యత తనదే. తను ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రాజెక్ట్ మ్యానేజర్. తన జీతంతోనే ఇల్లు గడుస్తుంది. ప్రతి పైసా జాగ్రత్త ఖర్చుపెడతాడు. గోవర్థన్ పెంట్ హోస్‌లోకి ఇందు (మృణాల్ ఠాకూర్‌) అద్దెకు వస్తుంది. తను మెల్లగా ఆ కుటుంబంతో కలిసిపోతుంది. గోవర్థన్‌ ని ఇష్టపడుతుంది. గోవర్ధన్ కూడా తన మనసులో మాట చెప్పే సమయంలో ఇందు గురించి ఓ నిజం తెలుస్తుంది. ఏమిటా నిజం? అసలు ఇందు ఎవరు? గోవర్థన్ ఇంటికి ఎందుకు వచ్చింది ? ఇందు గురించి నిజం తెలుసున్న గోవర్ధన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ?  అన్నదే ఈ చిత్రం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: