టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అనేక సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న శుహస్ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇతను కొంతకాలం క్రితం కలర్ ఫోటో అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకోవడంతో ఒక్క సారిగా ఈయనకు హీరోగా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ఈ నటుడు రైటర్ పద్మభూషణ్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. 

ఇక తాజాగా ఈయన హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఈయన నటించిన రెండు సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో సుహాస్ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఇంప్రెషన్ వచ్చింది. తాజాగా ఈ నటుడు ప్రసన్న వదనం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి అర్జున్ వైకే దర్శకత్వం వహించగా ... మణికంఠ , ప్రసాద్ రెడ్డి ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ ని మే 3 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.

మూవీ ట్రైలర్ ను ఏప్రిల్ 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ బృందం టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: