తెలుగు , తమిళ పరిశ్రమలలో సూపర్ క్రేజ్ కలిగిన బ్యూటీలాలో శృతి హాసన్ ఒకరు. ఈమె వరుస సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం శృతి హాసన్ , శాంతను హజారికా అనే వ్యక్తిని ప్రేమించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు కలిసి వీడియోలు చేయడం , ఫోటోలను దిగడం వాటిని తమ సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టి హల్చల్ చేయడం చాలా సార్లు జరిగింది.

ఇక దానితో శృతి హాసన్ ఎప్పుడు ఇతనితో ప్రేమలో ఉన్నట్లు చెప్పకపోయినప్పటికీ వీరి ప్రవర్తన ప్రేమలో ఉన్నట్లే జనాల అందరికీ అర్థం అయింది  అలాగే వీలు చిక్కినప్పుడల్లా శృతి , శాంతను గురించి గొప్పగా మాట్లాడుతూ వచ్చేది. ఇకపోతే తాజాగా వీరికి బ్రేకప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఈ మధ్య కాలంలో వీరిద్దరు కూడా ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారు. అదే ఈ వార్తలకు బలం చేకూర్చింది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా శృతి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి డిలీట్ చేసింది. ఇకపోతే గత నెల రోజులుగా వీరిద్దరు కూడా ఎవరికి వారే ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇలా ఈ కారణాలతో శృతి , శాంతను కు మధ్య బ్రేకప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి  ఇకపోతే పోయిన సంవత్సరం ఈ బ్యూటీ వీర సింహా రెడ్డి , వాల్టేరు వీరయ్య , హాయ్ నాన్న సలార్ అనే నాలుగు మూవీ లలో నటించింది. ఈ నాలుగు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇక ఈమె "సలార్ 2" లో కూడా హీరోయిన్ గా నటించబోతుంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: