మోస్ట్ టాలెంటెడ్ నటుడు అల్లరి నరేష్ తాజాగా ఆ ఒక్కటి అడక్కు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో పొడుగు కాళ్ళ సుందరి పరియ అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా ... మళ్లీ అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను కొన్ని పాటలను ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. 

ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఆ ఒకటి అడక్కు సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ వేదికను ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. మే 1 వ తేదీన సాయంత్రం 6 గంటలకు , దస్పల్లి , హైదరాబాద్ లో ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం నరేష్ , నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో నరేష్ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇక హీరోగా అల్లరి నరేష్ ఆఖరుగా ఉగ్రం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అంతకు ముందు ఈయన నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఆ ఒకటి అడక్కు మూవీ తో నరేష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: