టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తెచ్చిపెట్టి టాలీవుడ్ చరిత్రను తిరగ రాసింది పుష్ప పార్ట్ 1 సినిమా. అందుకే ప్రస్తుతం సెకండ్ పార్ట్‌ను కూడా అంతకుమించి అనేలా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్‌తో వస్తున్న ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.కేవలం 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది చూసిన సాంగ్‌గా నిలిచింది పుష్ప.. పుష్ప సాంగ్. అలాగే.. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 40 మిలియన్స్ వ్యూస్, 1 మిలియన్‌కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌ని ప్రస్తుతం షేక్ చేస్తోంది.


టాలీవుడ్ లో మొదటి 24 గంటల్లో ఒక్క మహేష్ బాబు రికార్డ్స్ ని తప్ప అన్ని రికార్డ్స్ ని బద్ధలు కొట్టింది.పుష్ప పుష్ప లిరికల్‌ సాంగ్‌ని మొత్తం 6 భాషల్లో రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఇండియాలోనే ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే 100కె+ రీల్స్‌తో సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పుష్పగాడి స్టెప్పులే కనిపిస్తున్నాయి.ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ పాటకి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది. వ్యూస్ పరంగా హిందీ వెర్షన్ కూడ దుమ్ముదులిపేస్తోంది. పుష్ప పార్ట్ 1 తెలుగులో కంటే హిందీలోనే బాగా సూపర్ హిట్ అయింది. దీంతో పార్ట్ 2 కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకు నిదర్శనమే ఫస్ట్ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే తమిళంలో మాత్రం పుష్ప పాటకి సరైన రెస్పాన్స్ రావట్లేదు. అక్కడ కేవలం 1 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి.ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. రష్మక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. మరి ఈసారి పుష్పగాడు ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: