తమిళ పాపులర్ యాక్టర్, డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించిన అరణ్మనై 4 సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద అదరగోడుతూ జోరు చూపిస్తోంది.ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే 18 కోట్లకు పైగా వసూలు చేసింది.ఇక ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ కూడా కంప్లీట్ చేసుకును మరింత దూకుడుగా ముందుకు పోతోంది. తెలుగులో అరిగిపోయిన హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా తమిళంలో మాత్రం ఇంకా జోరు చూపిస్తోంది. ఈ మూవీని తమిళ ఆడియెన్స్ ఎగబడి చూస్తున్నారు.ఈ అరణ్మనై 4 సినిమా పది రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే.. తమిళనాడులో రూ. 41.60 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 3.55 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.95 కోట్లు ఇంకా ఓవర్సీస్‌లో 5.10 కోట్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్‌గా రూ. 54.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, రూ. 26.25 కోట్ల షేర్ కలెక్షన్స్ ఈ సినిమా కొల్లగొట్టింది.బాక్సాఫీస్ బరిలోకి రూ. 18 కోట్ల రేంజ్ టార్గెట్‌తో బరిలోకి దిగిన అరణ్మనై 4 సినిమా  రూ. 8.25 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని తమిళనాడులో సూపర్ హిట్‌గా దూసుకుపోతోంది. ఇంకా లాంగ్ రన్‌లో ఈ సినిమా మరింత లాభాలు అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.


సుందర్ సి. డైరెక్ట్ చేసిన అరణ్మనై 4 మూవీలో సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా, వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్, యోగి బాబు, జయప్రకాష్, కెఎస్ రవికుమార్, కోవై సరళ, విటివి గణేష్, ఢిల్లీ గణేష్, రాజేంద్రన్, సింగంపులి తదితరులు నటించారు.మొదట ఈ మూవీని ఏప్రిల్ 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ వేసవి సెలవుల్లో రిలీజ్ చేస్తే థియేటర్ ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుదన్న కారణంతో మే 3న సినిమాని రిలీజ్ చేశారు. అవనీ సినీమాక్స్ పతాకంపై ఖుష్బూ సుందర్ ఈ మూవీని నిర్మించారు. ఇది అరణ్మనై సినిమా సిరీస్‌లో నాలుగో మూవీగా వచ్చింది. ఇది 2021 లో విడుదలైన అరణ్మనై 3 సినిమాకు సీక్వెల్. కాగా తెలుగులో బాక్ అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా హిట్ అవ్వడంతో రాశీ ఖన్నాకి తమిళంలో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికీ రెండు సినిమాలకు సంతకాలు చేసింది. తమిళ స్టార్ హీరో జయం రవి ఇంకా యంగ్ హీరో అదర్వ మురళి సినిమాలలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: