మాస్ మహారాజ్ రవితేజ సినిమాలు మంచి ఎంటర్టైన్ మెంట్ గా ఉంటాయి. ఒక్కోసారి కధల ఎంపికలో పొరపాటు జరిగి సినిమా కాస్త నిరాశపరచిన రవితేజ పెరఫామెన్స్ పరంగా ఎప్పుడు అభిమానులను నిరాశ పరచలేదు.సపోర్ట్ లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్న మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దాదాపుగా 60 సినిమాలకు పైగా చేసిన రవితేజ టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోలలో ఒకడిగా ఉన్నాడు.అంతేకాక ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా మారి అభిమానులకు మరింతగా చేరువ అయ్యాడు. 50 సంవత్సరాల వయస్సులో కూడా కుర్ర హీరోలకు దీటుగా నటిస్తున్నాడంటే రవితేజ ఫిట్ నెస్ ని ఎంతలా కాపాడుకుంటాడో అర్ధం చేసుకోవాలి. కాస్త విరామం తీసుకోని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రవితేజ రాకెట్ లా దూసుకుపోతున్నాడు.
 
ఇక రవితేజ వ్యక్తిగత విషయానికి వస్తే… రవితేజ తన కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. తన స్టార్ ఇమేజ్ కారణంగా తన కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడతాడు రవితేజ. అందుకే రవితేజ భార్య,పిల్లలు ఎలా ఉంటారో కూడా ఎవరికీ తెలియదు. ఆ మధ్య సోషల్ మీడియాలో రవితేజ భార్య,పిల్లల ఫోటోలను పోస్ట్ చేసే వరకు ఎవరకు తెలియదు. అంతలా జాగ్రత్తలు తీసుకుంటాడు.రవితేజ పెద్దలు కుదురిచ్చిన కళ్యాణిని వివాహం చేసుకున్నాడు. 2002 వ సంవత్సరంలో మే 26 న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో రవితేజ వివాహం జరిగింది. అప్పట్లో రవితేజ వివాహానికి పూరి జగన్నాథ్,కృష్ణ వంశీ ,శివాజీ రాజా తదితరులు హాజరు అయ్యారు.కళ్యాణి రవితేజకు చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయే. ఎందుకంటే కళ్యాణి రవితేజకు స్వయానా మేనమామ కూతురు.
 
కళ్యాణి తండ్రి రవితేజ తల్లి రాజ్యలక్ష్మికి సోదరుడు. హీరోగా ఎదుగుతున్న రవితేజకు బయట అమ్మాయితో పెళ్లి చేయటం కన్నా బంధువుల అమ్మాయి అయితే బెటర్ అని భావించిన రవితేజ తల్లి తన మేనకోడలు కళ్యాణిని కోడలుగా చేసుకుందామని భావించి రవితేజను ఒప్పించి వివాహం చేసిందట.వివాహం అయ్యాక రవితేజ ఇంటిలో అడుగు పెట్టిన కళ్యాణి రవితేజకు అనుకూలంగా ఉంటూ షూటింగ్స్ లో ఉండే ఒత్తిడిని తగ్గించే విధంగా ప్రవర్తించి బందు వర్గాలలో మంచి పేరు సంపాదించింది. ఇంటికి సంబందించిన అన్ని వ్యవహారాలను కళ్యాణి చూసుకొని రవితేజకు ఊరటను కలిగిస్తుంది. వీరికి ఒక అమ్మాయి,ఒక అబ్బాయి ఉన్నారు. ఒక సినిమాలో రవితేజ కొడుకు నటించిన, ఇక సినిమాలు చేయకుండా చదువుకె అంకితం అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: