యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 2022 వ సంవత్సరంలో విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ తో ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ లభించింది. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత మూవీలను కూడా అదే స్థాయిలో చేయాలి అని డిసైడ్ అయ్యాడు.

అందులో భాగంగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్ లను మొదలు పెట్టబోతున్నారు. అందులో భాగంగా మే 19 వ తేదీన "ఫియర్" అంటూ సాగే ఈ మూవీ లోని మొదటి సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఇక ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సాంగ్ విడుదల గురించి అప్డేట్ వచ్చిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆయన దేవర మూవీలోని ఫియర్ అంటూ సాగే మొదటి సాంగ్ అదిరిపోయే లెవల్లో ఉండబోతుంది. ఈ సాంగ్ వచ్చాక జైలర్ మూవీలోని హుకుం సాంగ్ ను మీరు మర్చిపోతారు అని ఈయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇకపోతే జైలర్ మూవీ కి మరియు దేవర మూవీ కి రెండింటికి కూడా సంగీతం అందించింది అనిరుద్ రవిచంద్రన్ కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: