రౌడీ బాయ్స్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటువంటి ఆశిష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన హీరోగా రూపొందిన రౌడీ బాయ్స్ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ ఇతను మాత్రం ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన కమర్షియల్ విజయం కోసం ప్రస్తుతం ఎంతో కసిగా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈయన సెల్ఫీస్ అనే మూవీ ని కూడా మొదలు పెట్టాడు. ఆ మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆగిపోయింది. 

ఇక మరి కొంత కాలం లోనే సెల్ఫిష్ మూవీ రీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సెల్ఫిష్ మూవీ రీ స్టార్ట్ అయ్యే లోపు ఈయన లవ్ మీ అనే ఓ సినిమాను కంప్లీట్ చేశాడు. ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ... అరుణ్ భీమవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈయన ఈ సినిమాతోనే దర్శకుడగా తన కెరీర్ ను మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమాను మే 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల కోసం ఓ ఈవెంట్ ను చేయబోతున్నట్లు అందుకు సంబంధించిన వేదికను ఖరారు చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదు లోని ఏ ఏ ఏ సినిమాస్ నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: