నాచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఓ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ నాని కెరియర్ లో 32 వ మూవీ గా స్టార్ట్ కాబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ మూవీ ని సుజిత్ గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రూపొందించబోతున్నట్లు దానితో ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగు సినీ పరిశ్రమలో మంచి టాలెంట్ ఉన్న యువ దర్శకులలో ఒకరు అయినటువంటి సుజిత్ , టాలెంటెడ్ నటుడు నాని తో మూవీ చేయబోతున్నాడు అని వార్తలు బయటికి రావడం తోనే ఈ కాంబో మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ తాజాగా ఈ మూవీ ఆగిపోయింది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో చాలా యాక్షన్స్ సన్నివేశాలు ఉండనున్న నేపథ్యంలో మరియు ఈ సినిమాను అత్యంత డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో రూపొందించాల్సి రావడంతో ఈ మూవీ కి భారీ బడ్జెట్ అవసరం ఉంటుంది అని అంత బడ్జెట్ సినిమాకు వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఈ మూవీ ఆగిపోయినట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇక సుజిత్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఓజి అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి వీరిద్దరూ ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేసిన తర్వాత వీరి కాంబోలో మూవీ ఉంటుందా లేదా అనేది క్లియర్ గా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: