తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న టైర్ 2 హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం టైర్ 2 హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన సినిమాకు సంబంధించిన టీజర్ కానీ , ట్రైలర్ కానీ విడుదల అయింది అంటే అవి మంచి వ్యూస్ ను తెచ్చుకుంటూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ఈయన నటించిన డబల్ ఈస్మార్ట్ మూవీ కి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ టీజర్ టైర్ 2 హీరోలలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల టీజర్ లో 8 వ ప్లేస్ లో నిలిచింది. మరి ఈ మూవీ కంటే ముందు ఏ సినిమాల టీజర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి మూవీ టీజర్ కి విడుదల అయిన 24 గంటల్లో 10.36 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ టీజర్ కు 9.82 మిలియన్ వ్యూస్ దక్కగా , అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ మూవీ టీజర్ కు 9.78 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఆ తర్వాత నిఖిల్ హీరోగా రూపొందిన స్పై మూవీ టీజర్ కి 9.72 మిలియన్ వ్యూస్ దక్కాయి. 

రామ్ పోతినేని హీరోగా రూపొందిన ది వారియర్ మూవీ టీజర్ కు 9.38 మిలియన్ వ్యూస్ దక్కగా , కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అమిగోస్ మూవీ టీజర్ కు 8.49 వ్యూస్ దక్కాయి. నాగ చైతన్య హీరోగా రూపొందిన కస్టడీ మూవీ టీజర్ కు 8.33 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇక తాజాగా విడుదల అయిన డబల్ ఈస్మార్ట్ మూవీ టీజర్ కు 24 గంటల్లో 7.04 మిలియన్ వ్యూస్ దక్కాయి. టాలీవుడ్ టైర్ 2 హీరోలలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్టులో ఇది వరకే ది వారియర్ మూవీ తో టాప్ ప్లేస్ లో నిలిచిన రామ్ , డబుల్ ఈస్మార్ట్ టీజర్ తో మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: