టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఆయన చేయాల్సిన లైనప్ కూడా భారీగానే ఉంది. గతేడాది హాయ్ నాన్న సినిమాతో నాని సూపర్ హిట్ కొట్టారు.డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు నేచురల్ స్టార్. అయితే, సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్‍తో నానిమూవీ చేయాల్సి ఉంది. అయితే, నాని - సుజీత్ (Nani 32) సినిమా ప్రారంభం కాకముందే సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది.నానితో భారీ రేంజ్‍లో యాక్షన్ మూవీ చేసేందుకు దర్శకుడు సుజీత్ కథను సిద్ధం చేసుకున్నారు. స్క్రిప్ట్ నచ్చటంతో నాని కూడా ఓకే చెప్పారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌ కింద ఈ డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించేందుకు రెడీ అయ్యారు. అయితే, బడ్జెట్ అంచనాలు భారీగా పెరగడడంతో ఈ సినిమా మొదట్లోనే సందిగ్ధంలో పడిందని సినీ సర్కిల్ నుంచి టాక్ బయటికి వచ్చింది.నానితో సినిమా కోసం డైరెక్టర్ సుజీత్ ప్రొడ్యూసర్‌ను భారీ బడ్జెట్ అడిగారని తెలుస్తోంది. అయితే, ఈ చిత్రం కోసం ఆ స్థాయిలో ఖర్చు చేసేందుకు నిర్మాత దానయ్య పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం నాని మార్కెట్‍ను బట్టి చూస్తే ఆ బడ్జెట్ చాలా ఎక్కువగా ఉందని, ఆ స్థాయిలో వెచ్చించేందుకు ఆయన ముందుకు రావడం లేదని సమాచారం.

ఇలా బడ్జెట్ అంచనాలు భారీగా ఉండటంతో నాని - సుజీత్ సినిమా ఆరంభంలోనే సందిగ్ధంలో పడిపోయింది. అయితే, బడ్జెట్ విషయంపై డైరెక్టర్, మేకర్స్ మధ్య మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ మూవీ దాదాపు హోల్డ్‌లోనే ఉందని తెలుస్తోంది. మరి నాని - సుజీత్ క్రేజ్ ప్రాజెక్ట్ ఇబ్బందులను దాటి సెట్స్‌పైకి వస్తుందా అనేది చూడాలి.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని చేస్తున్న 'సరిపోదా శనివారం' సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్నట్టు ఇటీవలే మేకర్స్ అప్‍డేట్ ఇచ్చారు. అయితే, ఈ మూవీని కూడా నిర్మిస్తున్నది నిర్మాత డీవీవీ దానయ్యే. 'అంటే సుందరానికి' తర్వాత నాని - వివేక్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ మూవీకి మంచి క్రేజ్ ఉంది.
సరిపోదా శనివారం కూడా పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం వస్తోంది. ఆగస్టు 29వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఒకవేళ సరిపోదా శనివారం మంచి కలెక్షన్లు రాబట్టుకుంటే.. నాని - సుజీత్ మూవీకి బడ్జెట్ ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.సరిపోదా శనివారం తర్వాత నాని చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తనకు దసరా లాంటి బ్లాక్‍బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా (Nani 33)కు నాని ఓకే చెప్పారు. ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇప్పటికే వచ్చింది. బలగం ఫేమ్ వేణు ఎల్డండితో ఎల్లమ్మ సినిమా కూడా నాని చేయనున్నారు. ఒకవేళ సుజీత్‍తో సినిమాకు బడ్జెట్ చర్చలు సఫలమైతే ముందుగా ఆ దాన్నే పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: