యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి, ఆయన నటనా కౌశల్యం గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకునే ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.నందమూరి ఫ్యామిలీ నట వారసుడిగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. rrr సినిమా తర్వాత నుంచి ఆయన ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ప్రస్తుతం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చి అందరినీ ఉర్రూతలూగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ భయపెట్టే పాటు రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ది గ్రేట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రేజీ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అలాగే అనిరుథ్ సంగీతం అందిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, నరేన్, ప్రకాశ్ రాజ్, చైత్ర రాయ్, అభిమన్యు సింగ్, కళైరసన్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.హై ఓల్టేజ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ జనవరిలో విడుదల అయింది. కాసేపు మాత్రమే ఉన్నా అంతా ఫిదా అయిపోయేలా చేశారీ గ్లింప్స్ తో. గ్లింప్స్ వచ్చిన తర్వాత నుంచి జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో మూవీపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. అంతా ఆతృతగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ల గురించి తెలుసుకుంటున్నారు. అయితే అలాంటి వాళ్లకోసమే అన్నట్లుగా మూవీ టీం ఓ క్రేజీ న్యూస్ ను విడుదల చేసింది. ఈ సినిమాలోని ఓ సూపర్ సాంగ్ రాబోతున్నట్లు ప్రకటించింది.ముఖ్యంగా దేవర సినిమా నుంచి అందిరనీ భయపెట్టేందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దేవర ఫియర్ సాంగ్ మే 19వ తేదీన రాబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ ఆదివారమే అన్నమాట. ఈ ఆదివారం స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయిన మూవీ టీం.. ఈ విషయాన్ని చెప్పగా అంతా తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. కచ్చితంగా ఆ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలని.. అదే సినిమాపై అంచనాలను మరింత పంచేస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. దేవర సినిమా అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ కొడుతుందనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: