ఒక వైపు సినిమాలు చూడడానికి జనాలు ఎవరు థియేటర్స్ కు రావడం లేదు అని తెలంగాణ లో చాలా ప్రాంతాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్ లను మూసివేశారు. ఇలాంటి సమయం లో మే నెలలో తెలుగు రాష్ట్రాల్లో అనేక సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అలా మే నెలలో విడుదల కాబోయే మూవీ లు ఏవో తెలుసుకుందాం. మిర్రర్ అనే మూవీ ఈ రోజు అనగా మే 17 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇక ఇంద్రాణి అనే సినిమా 24 వ తేదీన విడుదల కానుంది.

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను తాజాగా "రాజు యాదవ్" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మే 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు మొదట మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాను మే 24 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక రౌడీ బాయ్స్ మూవీ తో ప్రేక్షకులను బాగా అలరించిన ఆశిష్ తాజాగా లవ్ మీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాని మే 25 వ తేదీన విడుదల చేయనున్నారు.

విశ్వక్ సేన్ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. సుదీర్ బాబు హీరో గా రూపొందిన హారం హారా సినిమాను కూడా మే 31 వ తేదీన విడుదల చేయనున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన గం గం గణేశా సినిమాను కూడా మే 31 వ తేదీన విడుదల చేయనున్నారు. కార్తికేయ హీరోగా రూపొందిన భజే భాయ్ వేగం సినిమాను కూడా మే 31 వ తేదీన విడుదల చేయనున్నారు. కాజల్ ప్రధాన పాత్రలో రూపొందిన సత్యభామ మూవీ ని కూడా మే 31 వ తేదీన విడుదల చేయనున్నారు. మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ ని కూడా మే 31 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: