తమిళ సినీ పరిశ్రమలు అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో కార్తీ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించిన తమిళ నట తనకంటూ ఒక ప్రత్యేక ఈ ను ఏర్పరచుకున్నాడు. ఇక ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో చాలా మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈ నటుడికి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈయన నటించిన సినిమా లలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ నిలిచిన మూవీ లలో ఖైదీ మూవీ ఒకటి. 

మూవీ కి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కంటే ముందు లోకేష్ కనకరాజ్ కి గొప్ప గుర్తింపు లేదు. ఇక అప్పటికి కార్తీక్ కూడా తెలుగు లో మామూలు మార్కెట్ మాత్రమే ఉండడంతో ఈ సినిమా మామూలు అంచనాల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. ఇక ఈ సినిమా విడుదల అయిన తర్వాత అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని భారీ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది.

మూవీ ద్వారా ఇటు కార్తీ కి , అటు లోకేష్ కు తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇలా అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను మళ్ళీ థియేటర్ లలో విడుదల చేయనున్నారు. మే 25 వ తేదీన నటుడు కార్తీ పుట్టిన రోజు అన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను మే 25 వ తేదీన హైదరాబాద్ లోని కొన్ని థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: