ఒక్కో దర్శకుడికి ఒక్కో పిచ్చి ఉంటుంది. దర్శకుడు త్రివిక్రమ్ కి కూడా ఒక పిచ్చి ఉంది. అదేంటంటే హీరోయిన్స్ జీవితాలను నాశనం చేయడం. దీని అర్థం ఏమిటో?అలా అందుకు అనాల్సి వస్తుందో చూద్దాం?. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ ఒకరు. కామెడీ, ఎమోషన్స్ కలగలిపి పక్కా మాస్ కమర్షియల్ తీయడం ఆయన నైజం. త్రివిక్రమ్ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉండాల్సిందే. ఇక ఆయన డైలాగ్స్ కి పేరు పెట్టడానికి లేదు. జీవిత సారం సెటైరికల్ గా చెబుతాడు. కామెడీ పంచులు కూడా ఓ రేంజ్లో ఉంటాయి.ఇన్ని మంచి లక్షణాలు ఉన్న త్రివిక్రమ్ కి ఒక అవలక్షణం ఉంది. సెకండ్ హీరోయిన్ కి అన్యాయం చేస్తాడు. ఒకటి రెండు చిత్రాలు మినహాయిస్తే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఒక హీరోయిన్ కథలో కీలకం. మరొక హీరోయిన్ కి కనీస ప్రాధాన్యత ఉండదు. జల్సా చిత్రం తీసుకుంటే… ఇలియానా, పార్వతి మెల్టన్ హీరోయిన్స్. కమిలిని ముఖర్జీ కూడా ఉంది. ఇలియానాకు మాత్రమే స్క్రీన్ స్పేస్ ఉంటుంది. పార్వతి, కమలిని అలా కనిపించి ఇలా మాయం అవుతారు.

అత్తారింటికి దారేదిలో ప్రణీత సుభాష్ పరిస్థితి కూడా సేమ్. కనీసం ఒక డ్యూయట్ ఇచ్చి ఆమెను కాపాడారు. సినిమాలో ప్రధాన హీరోయిన్ సమంతకు మాత్రమే స్క్రీన్ స్పేస్ ఉంటుంది. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో ఆదా శర్మ రోల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మరీ వ్యాంప్ క్యారెక్టర్ లా ఉంటుంది. ‘అ ఆ’ మూవీలో సెకండ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ని కొన్ని సన్నివేశాలకు పరిమితం చేశాడు. అజ్ఞాతవాసిలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా… ఎవరికీ అంత ప్రాధాన్యత ఉండదు.అరవింద సమేత వీరరాఘవ మూవీలో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా రోల్ అయితే దారుణం. అల వైకుంఠపురంలో నటించిన నివేద థామస్ అన్యాయం అయిపోయింది. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరిని ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఈ సెకండ్ హీరోయిన్స్ అందరికీ స్క్రిప్ట్ చెప్పేటప్పడు త్రివిక్రమ్ మీ పాత్ర కీలకం అని చెబుతాడు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే ఏమీ ఉండదు. అరవింద సినిమా కోసం నేను బైక్ కూడా నేర్చుకున్నాను. నా సీన్స్ మొత్తం ఎడిట్ చేసి తీసేశారని ఈషా రెబ్బా ఆవేదన చెందింది. ఇలా త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్స్ గా నటించిన వారందరూ బలైపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: