గత రెండు రోజుల నుంచి తెలుగు బుల్లితెర పైన ఎక్కువగా వినిపిస్తున్న వార్త బుల్లితెర నటి పవిత్ర జయరామ్, యాక్టర్ చంద్ర మరణ వార్తలే తరచు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చంద్ర తన నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు ఐదు రోజుల క్రితం జరిగిన ఒక కారు ప్రమాదంలో పవిత్ర జయరామ్ అక్కడికక్కడే మృతి చెందింది.. అప్పటినుంచి చందు చాలా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని మీడియా ముందుకు కూడా ఎన్నోసార్లు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే సడన్గా ఆత్మహత్య చేసుకోవడంతో చందు మరణం ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది.


బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన సీరియల్స్ కార్తీకదీపం-2, రాధమ్మ పెళ్లి తదితర సీరియల్స్ లో చందు నటించారు.. తనతో పాటు నటించే పవిత్ర జయరామ్ మరణించిన ఐదు రోజులకె చందు కూడా తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు.. ముఖ్యంగా తను ఎంతో ఇష్టపడే పవిత్ర దూరం కావడం తనకు చాలా దురదృష్టమని అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురై చాలా నరకం అనుభవించాడని చందు సన్నిహితులు, స్నేహితుల సైతం తెలియజేస్తున్నారు. గతంలోనే  చందుకు శిల్ప అనే యువతిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆరేళ్ళ క్రితమే నటి పవిత్రత జయరాం సహజీవనం చేస్తున్నట్లుగా సమాచారం.


అయితే చందు పవిత్ర ఇద్దరూ కూడా ఒకే కారులో ప్రయాణిస్తూ ఉండగానే ఈ ఆక్సిడెంట్ జరగడంతో పవిత్ర జయరామ్ అక్కడికక్కడే మరణించగా చందు గాయాలతో బయటపడ్డారు. పవిత్ర తన కళ్ళ ముందే చనిపోవడం చందు జీర్ణించుకోలేకపోయాడు..దీంతో తాను ఒంటరివాడు అయిపోయాననే ఫీలింగ్ తో రెండు రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు కావడం చేత చాలా డిప్రెషన్ కి గురయ్యారు.. దీంతో రెండు రోజులు ఆగు అంటూ తన ఇన్స్టాల్ లో పోస్ట్ పెడుతూ ప్రతిరోజు ఆమె జ్ఞాపకాలను గుర్తుచేసుకునేవారు చందు.. చనిపోయే రోజు కూడా గుడ్ మార్నింగ్ నాన్న ఇట్స్ టైమ్ ఫర్ జిమ్ మన జిమ్ కోచ్ ఇప్పుడే కాల్ చేశాడు లవ్ యూ పాప అంటూ ఒక పోస్ట్ ని కూడా షేర్ చేశారు. చందు ఆత్మహత్యకు ఇంకా గల కారణాలను మాత్రం పోలీసులు విచారణ చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: