గత ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు కోలివుడ్ స్టార్ హీరో దళపతి విజయ్. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే లియో తర్వాత ది గోట్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దళపతి విజయ్. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభూ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. కాగా ఇందులో మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్గా కనిపించబోతోంది. అలాగే స్నేహ

 లైలా ప్రశాంత్ ప్రభుదేవా వంటి స్టార్స్ పలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.  అదేంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను దర్శకుడు తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అయితే విజయ్ నటిస్తున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ వరకు కోసం అవతార్ అవెంజర్స్ వంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ కి పనిచేసిన ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేసినట్లు గా తెలిపారు.

 తాజాగా సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులను కూడా కంప్లీట్ చేసినట్లుగా దర్శకుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దాంతోపాటు సినిమాకి సంబంధించిన మరొక ఆసక్తికరమైన ఫోటోని కూడా షేర్ చేశాడు. ఇక ఆయన షేర్ చేసిన ఆ ఫోటోలో విజయ్ లుక్ చాలా పవర్ ఫుల్ గా కనిపించింది. దాంతోపాటు డి ఏజింగ్ టెక్నాలజీ ను ఉపయోగించి విజయ్ ను ఇందులో చాలా యంగ్ గా చూపించినట్లు గా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 5న భారీ గా విడుదల చేయనున్నారు. మరి లియో సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దళపతి విజయ్ ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: