లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా ఇండియన్ 2 అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ,  రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

కానీ అప్పటి వరకు ఈ సినిమా పనులు పూర్తి కావు అన్న నేపథ్యంలో ఈ మూవీ విడుదలను జూన్ నెలలో వాయిదా వేశారు. ఆ తర్వాత జూలై నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు అందులో భాగంగా జులై 11 వ లేదా 17 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేసే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని మరియు ఈ మూవీ యొక్క మొదటి సాంగ్ విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రకారం ఈ సినిమాను జూలై 12 వ తేదీన తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ మూవీ లోని మొదటి పాటను మే 22 వ తేదీన తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ లోని మొదటి పాట ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో , ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: