టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమాను మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కాజల్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తుంది. 

ఇక ఈ మూవీ బృందం కూడా ఈ సినిమా యొక్క ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ ను నిర్వహించబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు సత్యభామ సినిమాలో ఎవరు ఏ క్యారెక్టర్స్ చేశారు. అనే దాన్ని ఇంట్రడ్యూసింగ్ చేయనున్నట్లు అలాగే దానితో పాటు ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే కాజల్ అగర్వాల్ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ కు జోడి గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ మూవీ తర్వాత ఈమె సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ బ్యూటీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: