నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే అగ్ర హీరోగా ఎదిగాడు. అద్భుతమైన నటనా నైపుణ్యంతో తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎవరి సహాయం లేకుండా స్వశక్తితో కష్టపడుతూ చివరికి స్టార్ హీరో అయిపోయాడు. ఎంత కష్టమైన డైలాగ్స్‌ అయినా అనర్గళంగా చెప్పగల ఏకైక తెలుగు నటుడు జూనియర్ ఎన్టీఆర్. సింగల్ టేక్ ఎలాంటి డాన్స్ అయినా చేయగలడు. ఏ ఎమోషన్ అయినా సింపుల్ గా వ్యక్తం చేయగలడు, నందమూరి తారకరామారావు సినిమాతోనే తారక్ బాల నటుడిగా మారాడు. సీనియర్ ఎన్టీఆర్ తారకను బాగా మెచ్చుకునేవారు. గొప్ప నటుడు అవుతారని నమ్మేవారు అందుకే ఆయనను బాల నటుడిగా పరిచయం చేశారు. తారక్‌ను బ్లెస్ చేసి ముందుకు నడిపించారు. ఎన్టీఆర్ ఆశీస్సులతోనే ఇప్పుడు ఈ హీరో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ స్టార్ గా నిలిచాడు. ఈరోజు (మే 20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందాం.

జూ.ఎన్టీఆర్ చేసిన మొట్టమొదటి మూవీ “బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)”. ఈ సినిమాలో తాతయ్యతో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆపై గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన "బాల రామాయణం" మూవీలో రాముడిగా యాక్ట్ చేసి అదరగొట్టాడు. ఇలా రెండు సినిమాల్లో బాల నటుడిగా కనిపించాక సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టాడు. అప్పటికి తారక్ వయసు కేవలం 17 ఏళ్ళే. హీరోగా ఈ హీరో చేసిన తొలి మూవీ “నిన్ను చూడాలని (2001)”. వీఆర్ ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ ఫ్లాప్ అయింది.అయినా తారక నిర్భయంగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. అదే సమయంలో దర్శకేంద్రుడు కె.రాఘవేందర్రావు కోరిక మేరకు రాజమౌళి తారక్‌తో కలిసి "స్టూడెంట్ నెంబర్ 1" సినిమా రూపొందించాడు. మూవీ అప్పట్లో సెన్సేషనల్ హిట్ సాధించింది. దీంతో ఎన్టీఆర్ మనవడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అనే సంగతి అందరికీ తెలిసింది. మంచిగా డ్యాన్స్, యాక్టింగ్ చేయడంతో ఆయనకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. దీని తర్వాత అతనుకు అవకాశాలు వెలువల్లా వచ్చాయి.

దీని తర్వాత వి.వి వినాయక్‌తో కలిసి ‘ఆది’ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో ఈ నందమూరి కుర్రోడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిపోయాడు. రాజమౌళి తొలి సినిమాతోనే  తారక్‌కు మంచి ఫ్రెండ్ అయ్యాడు తారక్ పర్సనాలిటీ, మంచితనం కష్టపడే తత్వం రాజమౌళికి బాగా నచ్చింది అందువల్ల మళ్లీ అతనితో కలిసి మరో మూవీ తీయడానికి సిద్ధమయ్యాడు. అదే "సింహాద్రి" జక్కన్న తారక్ కాంబినేషన్‌లో వచ్చిన సెకండ్ మూవీ అది. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

అయితే సింహాద్రి కంటే ముందు తారక్‌కు సుబ్బు, అల్లరిరాముడు, నాగ వంటి ఫ్లాప్స్ పలకరించాయి. ఈ సమయంలో రాజమౌళి అతడిని సేవ్ చేశాడు. వీటి కారణంగా బాగా డిసప్పాయింట్ అయిన ఎన్టీఆర్ మంచి కథ ఉన్న "సింహాద్రి" దొరికేయడంతో అందులో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు, ఆ ఒక్క మూవీతో మళ్లీ స్టార్ హీరోల సరసన నిల్చున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు ఓ ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు క్రియేట్ చేసింది. రూ.8 కోట్లతో ఈ సినిమా తీస్తే దాదాపు రూ.26 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సక్సెస్ తో తారక్ కెరీర్లో వెను తిరిగి చూసుకోలేదు. దీని తర్వాత కొన్ని అపజయాలు ఎదురైనా అతను తట్టుకొని నిలబడుతూ ఇప్పుడు గ్లోబల్ లెవెల్ లో పేరు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అతనికి వరల్డ్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ యంగ్ టైగర్ “దేవర” మూవీలో నటిస్తున్నాడు. అది కూడా హిట్ అయితే ఈ హీరో పాపులారిటీలో ఇంకో మెట్టు ఎదుగుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: