ఎన్.టి.ఆర్. - ఈ పేరుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చరిత్ర ఉంది... ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ ఎన్నటికీ చెరగని ముద్ర వేశారు నందమూరి తారక రామారావు.మనవడు, హరికృష్ణ కుమారుడికి తన పేరే పెట్టారు. నటనలో టన్నుల కొద్దీ ట్యాలెంటుతో తాతకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీ రామారావు తెలుగు సినిమాలపై కాన్సంట్రేట్ చేశారు. మధ్యలో తమిళ, హిందీ సినిమాలతో విజయాలు అందుకున్నా అటు వైపు దృష్టి పెట్టలేదు. పెద్దగా అడుగులు వేయలేదు. ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాల్సిన బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ మీద ఉంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు తెరపై తిరుగులేని నటుడు.. ఇంకా చెప్పాలంటే.. ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య.తాత నుంచి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. జనాల చేత జైజేలు కొట్టించుకుంటున్నాడు ఈ చిన్న ఎన్టీఆర్. ఈ రోజు ఎన్టీఆర్. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియాఅయితే ఎన్టీఆర్ పోస్టులతో మారుమోగిపోతుంది. చరణ్, బన్నీ లాంటి అగ్రతారలు తారక్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తోన్న దేవర .. అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ సోషల్ మీడియాను పెద్దగా యూజ్ చేయరు. అయినప్పటికీ.. అతన్ని ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య మిలియన్లలోఉంటుంది. తారక్‌కు ఇన్ స్టాలో 7.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ తారక్ ఎవరన్నీ ఫాలో అవ్వడం లేదు.

ఇక ఫేస్‌బుక్ విషయానికి వస్తే… ఎన్టీఆర్‌ను 6.3 మిలియన్ల మంది ఫాలో అవుతనన్నారు. ఫేస్‌బుక్‌లో మాత్రం తారక్ రెండు ఖాతాలను అనుసరిస్తున్నారు. ఎవర్ని అనేది మీకు తెల్సా..? ఆ ఖాతాల్లో ఒకటి దర్శకధీరుడు రాజమౌళిది కాగా.. మరొకటి… ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్. ఇకసోషల్ మీడియా లో కూడా తారక్‌కు 7.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో సైతం తారక్ రాజమౌళి ఒక్కడిని మాత్రమే అనుసరిస్తున్నారు.ఇక తదుపరి ల విషయానికి వస్తే.. వార్ 2తో బాలీవుడ్‍లోనూ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో హృతిక్ రోషన్‍‍తో ఢీ కొట్టనున్నారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్. ఇక, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో మరో మూవీ చేయనున్నారు తారక్.

మరింత సమాచారం తెలుసుకోండి: