అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా రూపొందిన ఆర్ఎక్స్ 100 మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన పాయల్ రాజ్పూత్ ఈ మూవీ తోనే అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగు లో అనేక సినిమా ఆఫర్స్ దక్కాయి. అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈమె తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

అందులో భాగంగా నేను 2019 వ సంవత్సరం రక్షణ అనే ఓ సినిమాలో నటించాను. ఆ సినిమా పూర్తి అయ్యింది. కానీ ఆ సమయంలో అది విడుదల కాలేదు. ఇక నాకు ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ రావడంతో వారు ఇప్పుడు ఆ సినిమాను విడుదల చేయాలి అనుకుంటున్నారు. అందుకోసం నన్ను ప్రమోషన్ లు చేయమని అడుగుతున్నారు. ఇక నాకు ఆ సినిమా కోసం ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కూడా వారు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రమోషన్ చేయమని అంటున్నారు.

అలా చేయకపోతే నన్ను సినిమా ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తాం అని భయపెడుతున్నారు అని సోషల్ మీడియాలో పాయల్ రాజ్పూత్ ఓ పోస్ట్ చేసింది. ఇక దీనిపై తాజాగా TFPC తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించింది. తాజాగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తమకు మార్చి 28 వ తేదీన రక్షణ మూవీ ప్రమోషన్ లలో హీరోయిన్ పాయాల్ రాజ్పూత్ పాల్గొనడం లేదు అని సినిమా డైరెక్టర్ మరియు నిర్మాత ప్రణ్దిప్ నుంచి ఫిర్యాదు అందినట్లు తెలిపింది.

ఆ ఫిర్యాదు ప్రకారం అది నాలుగు సంవత్సరాల క్రితం సినిమా. దానిని ఓ టీ టీ లో విడుదల చేసుకోండి అని పాయాల్ రాజ్పూత్  చెప్పినట్లు వారు పేర్కొన్నారు.  సినిమాకు 50 రోజుల డేట్స్ ఇచ్చిన ఆమె కేవలం 47 రోజులు మాత్రమే పని చేశారు అని , సినిమా ప్రమోషన్ లలో కూడా పాల్గొనాలి అని అగ్రిమెంట్ లో ఉంది అని వారు పేర్కొన్నట్లు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: