ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... మలయాళ విలక్షణ నటుడు ఫాహధ్ ఫజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. 

అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం మాత్రం వరుస ప్రమోషన్ లతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇక కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ని కూడా మేకర్స్ విడుదల చేశారు. దానికి కూడా డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ రోజు ఈ సినిమాలోని సెకండ్ సింగల్ కి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ లోని రెండవ సింగిల్ అనౌన్స్మెంట్ వీడియోను రేపు ఉదయం 11 గంటల 07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ సినిమా లోని రెండవ పాట పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సాంగ్ అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa