తమిళ నటుడు విశాల్ తాజాగా రత్నం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ... తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా రత్నం అనే టైటిల్ తో ఒకే రోజు విడుదల అయింది.

సినిమా తమిళ్ లో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్నప్పటికీ , తెలుగు ప్రేక్షకులను మాత్రం ఈ మూవీ ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను మే 23 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా ఓ టీ టీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: