టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటి మాణులలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ తాజాగా సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న నవీన్ చంద్ర ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి రెడీ అయ్యారు. అందుకోసం ఈ మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఓ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి సంబంధించిన తేదీ , సమయాన్ని ప్రకటించడం మాత్రమే కాకుండా ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎవరూ రాబోతున్నారు అనే విషయాన్ని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను మే 24 వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ఐ టి సి , కోహినూర్ , హైదరాబాదు లో నిర్వహించనున్నట్లు ఆ ఈవెంట్ కు నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వస్తూ ఉండటంతో ఈ సినిమా ట్రైలర్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఒక వేళ ట్రైలర్ కనుక బాగున్నట్లు అయితే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: