కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో విశాల్ ఒకరు. ఈయన ఇప్పటికే అనేక తమిళ సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన నటించిన పందెంకోడి సినిమాను తెలుగు లో డబ్ చేసి విడుదల చేయగా ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించింది.

ఇదిలా ఉంటే తాజాగా విశాల్ "రత్నం" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి హరి దర్శకత్వం వహించగా ... ప్రియ భవాని శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ తమిళ , తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాను నిన్న ఈ మూవీ బృందం మే 24 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దానితో ఈ సినిమా మే 24 వ తేదీ నుండి ఓ టి టి లోకి అందుబాటు రాబోతున్నట్లు అంతా ఫిక్స్ అయ్యారు. కానీ చెప్పిన దాని కంటే ఒక రోజు ముందుగానే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తమ ఓ టీ టీ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకున్న ఈ సినిమా ఓ టి టి ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: