టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ బాబు నేటితరం సూపర్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వరుస బ్లాక్ బాస్టర్ హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు మహేష్ బాబు. అయితే  మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఒకప్పుడు ఎన్నో సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే.


 మహేష్ బాబు కొడుకు గౌతమ్ సైతం గతంలో మహేష్ నటించిన ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే మహేష్ గారాల పట్టి సీతారా మాత్రం ఇప్పటివరకు ఏ సినిమాలో నటించలేదు. అయినప్పటికీ ఆమెకు సోషల్ మీడియాలో మాత్రం కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార ఇక కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది అని చెప్పాలి. ఇక ఎప్పుడూ తన డాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. కాగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీతరకు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.


 ఒకవేళ మీ తండ్రి మహేష్ బాబు నటించిన సినిమాలలో ఏ పాత్ర చేయాలని మీరు అనుకుంటారు అంటూ ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పింది సితార. నాన్న మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాలో పాత్ర చేయాలని ఉంది అంటూ సితార చెప్పుకొచ్చింది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ తో నిర్వహించిన చిట్ చాట్ లో ఆమె ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అని అడగగా   తన పేరెంట్స్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక అమ్మ నాన్న ఇద్దరిలో ఎవరు బాగా స్ట్రిక్ట్ అని అడిగితే ఎవరు  కాదని ఇద్దరు తనతో సరదాగా ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది సితార.

మరింత సమాచారం తెలుసుకోండి: