తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శర్వానంద్ ప్రస్తుతం మనమే అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తూ ఉండగా ... తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న కృతి శెట్టి ఈ సినిమాలో శర్వానంద్ కి జోడి గా నటిస్తోంది. ఈ మూవీ కి ప్రస్తుతం తెలుగు లో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న హసిం అబ్దుల్ వాహెబ్ సింగీతం అందిస్తున్నాడు. 

మూవీ నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసినప్పటికీ ఈ సినిమా విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ఇకపోతే ఈ రోజు ఈ సినిమా యొక్క విడుదల తేదీని మేకర్స్ ప్రకటించబోతున్నారు. ఈ సినిమా యొక్క విడుదల తేదీని ఈ రోజు సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

ఇకపోతే ప్రస్తుతం శర్వానంద్ ఈ మూవీ తో పాటు సామజవరగమన సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ మూవీలోను , లూసర్ వెబ్ సిరీస్ తో మంచి ప్రశంసలు అందుకున్న అభిలాష రెడ్డి దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. ఇక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శర్వానంద్ , సంపత్ నంది దర్శకత్వంలో కూడా ఓ మూవీ లో నటించేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: